గట్టు మల్లన్న జాతరను విజయవంతం చేయాలి : తహసీల్దార్ కోమి

గట్టు మల్లన్న జాతరను విజయవంతం చేయాలి : తహసీల్దార్ కోమి

ధర్మసాగర్(వేలేరు), వెలుగు : మహాశివరాత్రిని పురస్కరించుకుని వేలేరు మండలం మల్లికుదుర్ల గట్టు మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో శనివారం తహసీల్దార్ కోమి వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఏర్పాట్లపై ఈవో అద్దంకి నాగేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

అనంతరం ఎస్సై సురేశ్​ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కుల మౌనిక సంపత్, ఒగ్గుపూజారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆలయ నూతన కమిటీని నియమించారు. చైర్మన్​గా పల్లె నిరంజన్​రెడ్డి, ఐదుగురు డైరెకర్లను నియమించారు.