ఇంస్టాగ్రామ్ ప్రియుడితో భార్య సహజీవనం... ప్రియుడిని నడిరోడ్డుపైనే కొట్టి చంపిన భర్త..

ఇంస్టాగ్రామ్ ప్రియుడితో భార్య సహజీవనం... ప్రియుడిని నడిరోడ్డుపైనే కొట్టి చంపిన భర్త..

జగిత్యాల జిల్లాలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. జగిత్యాల సాయిబాబా బైపాస్ రోడ్డు దగ్గర ఓ వ్యక్తిపై కర్రలతో దాడితో చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆదివారం ( ఫిబ్రవరి 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అంతర్గాం ఒడ్డెర కాలనీకి చెందిన గంగాధర్ భార్య తనను వదిలేసి.. ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన విశ్వనాధ్ అనే వ్యక్తితో ఏడాది కాలంగా సహజీవనం చేస్తోందని తెలుసుకొని.. విశ్వనాధ్ పై దాడి చేసి చంపేశాడు.

విశ్వనాధ్ పోరండ్ల గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. మేడిపల్లి మండలం పోరుమాలకి చెందిన యువతితో గంగాధర్ కు 12 ఏళ్ళ క్రితం వివాహం అయ్యింది.. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. కొన్ని కారణాలతో ఏడాది క్రితం భార్యాభర్త విడిపోయి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన విశ్వనాధ్ తో సహజీవనం చేస్తోంది గంగాధర్ భార్య.

విషయం తెలుసుకున్న గంగాధర్.. ఇవాళ సాయిబాబా బైపాస్ రోడ్డులో విశ్వనాధ్ పై కర్రతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. శివరాత్రి రోజున గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా.. విశ్వనాధ్ పై దాడి చేసి చంపేశాడు. తీవ్ర గాయాలవడంతో విశ్వనాధ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.