అంతర్జాతీయ సదస్సులో హనుమకొండ డీవైఎస్ వో

అంతర్జాతీయ సదస్సులో హనుమకొండ డీవైఎస్ వో

హనుమకొండ స్పోర్ట్స్, వెలుగు: ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ పై గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు హనుమకొండ డీవైఎస్వో గుగులోతు అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సదస్సులో భాగంగా 'ది లైఫ్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ ఠాకూర్ దేవ్ సింగ్' అనే అంశంపై శనివారం ఆయన పేపర్ ప్రజెంట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి అశోక్ కుమార్ వరంగల్ నిట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రవి కుమార్ పర్యవేక్షణలో పీహెచ్డీ స్కాలర్ గా ఉన్నాడు.