గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ లో చరిత్రలోనే తొలిసారిగా కాకతీయ వీరనారీ గౌరవార్థం రుద్రమ వి.1గా నామకరణం చేసిన మోడల్ రాకెట్‌ను ఈ నెల 28న నేషనల్ సైన్స్ డే పురస్కరించుకుని ఇస్రో స్పేస్ ట్యూటర్, అథార్ల్ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్ నేతృత్వంలో హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రయోగించటం, అవగాహన సదస్సు సందర్భంగా స్టూడెంట్స్‌లో సైన్స్ అంతరిక్ష పరిశోధనల పై ఆసక్తిని పెంచడం, వరంగల్‌ను స్పేస్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్ధడానికి కుడా ఆధ్వర్యంలో ఎక్స్ ఫోరా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు. శనివారం కాళోజీ కళాశేత్రంలో ఏర్పాట్లను కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి పరిశీలించారు.
