IND vs PAK: దేవుడా ఈ మ్యాచ్ జరగకుండా వర్షం పడాలి.. భారత్ని చూసి భయపడుతున్న పాక్..  

IND vs PAK: దేవుడా ఈ మ్యాచ్ జరగకుండా వర్షం పడాలి.. భారత్ని చూసి భయపడుతున్న పాక్..  

IND vs PAK: టీ20 ప్రపంచకప్ గ్రూప్–ఏలో భాగంగా భారత్–పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు మాజీ పాకిస్తాన్ క్రికెటర్ బాసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌కి వర్షం పడాలని నేను కోరుకుంటున్నాను.. అలా అయితే ఇరు జట్లకూ ఒక్కో పాయింట్ వస్తుందని అన్నారు. దీంతో బాసిత్ అలీ కామెంట్స్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. భారత జట్టును చూసి పాకిస్తాన్ టీం భయపడి పోతుందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈరోజు వర్షం 90 శాతం కంటే ఎక్కువగా పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ జట్లు రెండు మ్యాచ్‌లు గెలిచాయి. మెరుగైన నెట్ రన్‌రేట్ (NRR)తో టీమిండియా గ్రూప్-Aలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అయితే ఓవర్లు తగ్గించే అవకాశం ఉంది. కనీసం ఒక్కో జట్టు ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే, ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే లేకపోవడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున ఇవ్వనున్నారు. AccuWeather సమాచారం ప్రకారం, సాయంత్రం 6 గంటల వరకు సుమారు 40 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అనంతరం మరో 10 శాతం వర్షం కురిసే అవకాశం ఉంటుందని అంచనా. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ వేగంగా మైదానాన్ని కవర్లు వేసి సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.  


భారత్ జట్టు అంచనా:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్తాన్:
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), సైమ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.