Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కూలీ కోసం..షాకింగ్ రెమ్యూనరేషన్ ..? స్టార్ హీరోల కంటే ఎక్కువ

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కూలీ కోసం..షాకింగ్ రెమ్యూనరేషన్ ..? స్టార్ హీరోల కంటే ఎక్కువ

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)..ఇండస్ట్రీలో ఈ దర్శకుడి నుండి ఒక సినిమా వస్తుదంటే..నేషనల్ వైడ్ గా ఆ సినిమాకు వచ్చే హైప్ మామూలుగా ఉండదు. రీసెంట్ గా ఈ దర్శకుడి నుండి వచ్చిన లియో (Leo) మూవీ కలెక్షన్స్ చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సినిమాలో హీరో దళపతి విజయ్(Vijay) అయినప్పటికీ..కేవలం లోకేష్ అనే పేరువల్లనే అంత హైప్ క్రియేట్ అయ్యింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. 

అలాగే లోకేష్ తన సినిమాలను ఒకదానితో ఒకటి లింకప్ చేసి..లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ను క్రియేట్ చేసి..ఆడియన్స్ కు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్నారు. అయితే, ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇటీవలే లియో మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. తరువాతి సినిమా కోసం ఆడియన్స్, ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో కూలీ సినిమా షురూ చేశాడు. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అందులో భాగంగా రిలీజ్ చేసిన టీజర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో తలైవా స్మగ్లర్‌గా కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే..రజినీ కూలీ సినిమా కోసం తీసుకునే రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది.తలైవా ఏకంగా రూ.260 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.అలాగే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ రూ.60 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వీరి రెమ్యునరేషన్ పై సినీ సర్కిల్ లో చర్చ నడుస్తుంది. ఇక లోకేష్ రెమ్యునరేషన్ హీరోలకంటే ఎక్కువే. మరి అంతలా ఆడియన్స్ లో క్రేజీ పెంచుకున్నాడు.