60 ఏళ్ల వృద్ధుడికి గుండె శస్త్ర చికిత్స విజయవంతం

60 ఏళ్ల వృద్ధుడికి గుండె శస్త్ర చికిత్స విజయవంతం

మెడికవర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన చికిత్సను విజయవంతం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 60 సంవత్సరాల వృద్దుడికి గుండె శస్త్ర చికిత్సను  విజయవంతంగా పూర్తి చేశారు. గుండెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా.. గుండె లోపల ఉన్న రంధ్రాన్ని విఎస్ డి డివైస్ క్లోజర్ ద్వారా మూసివేసి అతని ప్రాణాలు కాపాడారు. ఇటువంటి గుండెపోటు వల్ల వచ్చే రంధ్రంతో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి.. 80 శాతం మంది చనిపోతారని డాక్టర్ సాకేత్ తెలిపారు.

అలాంటి పరిస్థితుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రమాదకరమని, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా తొడ భాగం నుండి VSD డివైస్‭ని గుండెలోకిని పంపించి గుండె రంధ్రాన్ని మూసివేసినట్లు డాక్టర్ సాకేత్ తెలిపారు.VSD డివైస్ క్లోజర్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించి వృద్ధుడి ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. అత్యాధునిక సదుపాయాలు, అధునాతన పరికరాలు అనుభవజ్ఞులైన డాక్టర్స్ వల్లనే ఇటువంటివి సాధ్యం అవుతాయని మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ హృషీకేష్ తెలిపారు. తమ తండ్రికి  కొత్త జీవితాన్ని అందించినందుకు వైద్యులకు ఆసుపత్రి సిబ్బందికి.. పేషెంట్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.