900కు దగ్గరలో ఒమిక్రాన్ కేసులు

900కు దగ్గరలో ఒమిక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 890 కొత్త వేరియంట్ కేసులు రికార్డయ్యాయని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ బుధవారం వెల్లడించింది. మహారాష్ట్రలో క్కువగా 252 మందికి ఒమిక్రాన్ సోకగా, ఢిల్లీలో 238, గుజరాత్‌‌‌‌‌‌‌‌లో 97, కేరళలో 65, తెలంగాణలో 62 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 241 మంది రికవర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు‌‌‌‌‌‌‌‌ లేదా వలస వెళ్లారని బులెటిన్‌‌‌‌‌‌‌‌లో అధికారులు తెలిపారు. ఇక, గడిచిన 24 గంటల్లో 9,195 మంది కరోనా బారిన పడ్డారని చెప్పారు. వీరితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,48,08,886కు చేరిందన్నారు. యాక్టివ్‌‌‌‌‌‌‌‌ కేసులు 77,002కు పెరిగాయని బులెటిన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. వైరస్‌‌‌‌‌‌‌‌తో 302 మంది మరణించారని, మృతుల సంఖ్య 4,80,592కు చేరిందన్నారు. వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇప్పటివరకు 143.15 కోట్ల డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది.