చెల్లెల్లి కాపురం కోసం ఎడ్లబండిపై ఢిల్లీకి

చెల్లెల్లి కాపురం కోసం ఎడ్లబండిపై ఢిల్లీకి

అత్తింటి వేధింపులు తాళలేక.. పుట్టింటికి వచ్చేసిన చెల్లిని చూసి ఆ అన్న కుమిలిపోయాడు. ఇంటిల్లిపాదీ కలిసి పోరాడినా చెల్లెలి కాపురం చక్కబడలేదు. తన చెల్లికి న్యాయం జరగలేదని భావించిన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన ఎన్.నాగదుర్గారావు సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీకి బయలుదేరారు. అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయిస్తానని ఆయన అంటున్నారు. మే 23న స్వగ్రామం ముప్పాళ్ల నుంచి ఎడ్లబండిపై బయలుదేరిన నాగదుర్గారావును మే27న డోర్నకల్ దగ్గర ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఏపీకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల మాట వినేందుకు నాగదుర్గారావు నిరాకరించారు. డోర్నకల్ మండలం మన్నెగూడెం నుంచి మళ్లీ  ఢిల్లీకి రిక్షా యాత్రను మొదలుపెట్టారు.