GT vs RCB: గుజరాత్‌తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు

GT vs RCB: గుజరాత్‌తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు

ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం(మే 04) గుజరాత్ టైటాన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకూ 10 మ్యాచ్‍ల్లో మూడింట(6 పాయింట్లు) విజయం సాధించిన బెంగళూరు జట్టుకు.. ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలవగలదు. మరోవైపు, గుజరాత్ పరిస్థితి అంతే. ఆడిన 10 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించిన గిల్ సేనకు.. ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. దీంతో రెండు సమజ్జీవుల మధ్య పోరు హోరాహోరీగా జరగవచ్చు. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు సారథి డు ప్లెసిస్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం చేజింగ్ పిచ్ కావడం, సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి మంచు కురిసే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బెంగళూరు అదే జట్టును కొనసాగిస్తుండగా.. గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.

తుది జట్లు

బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యష్ దయాల్.

గుజరాత్: శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.