ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: టీడీపీకి షాక్.. సీఐడీ చర్యలకు ఈసీ ఆదేశాలు..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: టీడీపీకి షాక్.. సీఐడీ చర్యలకు ఈసీ ఆదేశాలు..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమాయంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచుకునేందుకు ప్లాన్ చేశాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించటమే కాకుండా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తోంది టీడీపీ. ఈ అంశంపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలను తప్పు దోవ పట్టించేలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవాస్తవాలను ఐవీఆర్ఎస్ ద్వారా ప్రచారం చేసి ఎన్నికల కోడ్ ను ఉల్లంగిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ.

వైసీపీ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ వైసీపీ వాదనతో ఏకీభవించి చర్యలు తీసుకోవాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ అంశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ఆరోపణల ప్రస్తావన లేకపోవటంతో వారిపై చర్యలు ఉంటాయా లేదా అన్నది క్లారిటీ లేదు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో టీడీపీ చేస్తున్న అవాస్తవ ప్రచారంపై సీఐడీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.