సెక్రటేరియట్ సమీపంలో కారులో మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్

సెక్రటేరియట్ సమీపంలో కారులో మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్లోని సెక్రటరేటియట్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కననుంచి వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల చెలరేగడం గమనించిన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బయటికి రావడంతో ప్రమాదం తప్పింది. ఎప్పుడూ ఫుల్ ట్రాఫిక్ తో ఉండే ఈ ప్రాంతంలో కారులోంచి దట్టమైన మంటలు వ్యాపించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

మంటల్లో తగలబడిన షిఫ్ట్ కారు ఓనర్ సెక్రటేరియట్ లో ఉద్యోగిగా గుర్తించారు. కారు బ్యానెట్ లో మంటల చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సురక్షితంగా బయటపడ్డారు. 

ఎప్పుడూ ఫుల్ ట్రాఫిక్ తో ఉండే ఈ ప్రాంతంలో కారులోంచి దట్టమైన మంటలు వ్యాపించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతూ వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. అగ్నికి ఆహుతైన కారును ట్రాఫిక్ పోలీసులు మొబైల్ క్రేన్ వాహనం సహాయంతో అక్కడి నుంచి తొలిగించారు. ఈ ఘటనతో కేసు నమోదు చేసినట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు.