నాన్నకు నేనున్నా..

నాన్నకు నేనున్నా..

నాన్న సోడా బండి పెట్టి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తండ్రికి సాయంగా నేనున్నానంటూ ఓ చిన్నారి తోపుడు బండి నెడుతూ ఆసరా అయ్యింది. తన చెల్లిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్లింది. కాళ్లకు చెప్పులు లేకున్నా మండుటెండలో బండిని నెట్టుకుంటూ వెళ్లింది. బుధవారం ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలో తండ్రీ కూతుళ్లు ఇలా కనిపించారు.  - ఫొటోగ్రాఫర్, వెలుగు