Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం

Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం

భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా మరోసారి సత్తాచాటాడు. ప్రతిష్ఠాత్మక ఫెడరేషన్ కప్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.  ఒడిషా భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా బుధవారం(మే 15) జరిగిన ఫెడరేషన్ కప్ 2024లో పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు. 82.27 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి పసిడిని ముద్దాడాడు.

నీరజ్ అగ్రస్థానంలో నిలవగా.. 82.06 మీటర్ల దూరంతో మను(కర్ణాటక) రెండో స్థానంలో, 78.39 మీటర్ల దూరంతో ఉత్తమ్ పాటిల్(మహారాష్ట్ర) మూడో స్థానంలో నిలిచారు.

ఫెడరేషన్ కప్ 2024 ఫలితాలు: (పురుషుల జావెలిన్ ఫైనల్స్)

  • నీరజ్ చోప్రా: 82.27మీ
  • డిపి మను: 82.06మీ
  • ఉత్తమ్ పాటిల్: 78.39మీ

ఇదిలా ఉంటే, పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొననున్న కిషోర్ కుమార్ జెన్నా(75.49 మీటర్లు) ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇటీవల దోహా వేదికగా జరిగిన డైమండ్ లీగ్ 2024లోనూ నిరాశ పరిచాడు. బల్లాన్ని 77.31 మీటర్ల దూరం విసిరి తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

మరిన్ని వార్తలు