Ram Charan: మెగా మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్.. 500 కుటుంబాలకు ఆరోగ్య భరోసా!

Ram Charan: మెగా మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్.. 500 కుటుంబాలకు ఆరోగ్య భరోసా!

సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ అనేది కేవలం హిట్లు, కలెక్షన్లతోనే రాదు. తోటి మనుషుల పట్ల చూపించే మానవత్వంతోనే వస్తుంది. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే బాటలో పయనిస్తూ.. సినిమా కార్మికుల కష్టాల్లో పాలుపంచుకుంటున్నారు. లేటెస్ట్ గా ఆయన చేసిన ఒక గొప్ప పని సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

మాట ఇచ్చారంటే.. మడమ తిప్పరు!

గతంలో తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా రామ్ చరణ్ ఒక హామీ ఇచ్చారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు అండగా ఉంటానని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. అన్నట్లుగానే ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని 500 మంది సభ్యులకు , వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించారు. దీనికి సంబంధించి దాదాపు రూ. 50 లక్షల రూపాయల మొత్తాన్ని ఆయన వెచ్చిస్తున్నట్లు సమాచారం.

డ్యాన్సర్ల కష్టాలను గుర్తించి..

సినిమా పాటల్లో మనం చూసే అద్భుతమైన స్టెప్పుల వెనుక డ్యాన్సర్ల కఠిన శ్రమ ఉంటుంది. షూటింగ్ సమయంలో వారు శారీరకంగా ఎంతో రిస్క్ తీసుకుంటారు. ఒక్కోసారి ప్రమాదాలు జరిగి గాయపడటం, లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతుంటుంది. అటువంటి సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో, చరణ్ ఈ బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఈ హెల్త్ కార్డుల ద్వారా 500 కుటుంబాలకు వైద్య పరంగా పెద్ద భరోసా లభించనుంది.

హ్యాపీ మోడ్ లో మెగా ఫ్యామిలీ..
 

శనివారం జనవరి 31న రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఒక అబ్బాయి,  ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. దీంతోతో మెగా ఫ్యామిలీ, ఫుల్ హ్యాపీ మోడ్లో ఉంది.ఈ సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో ప్రత్యేక ఫొటోలను పంచుకుంటూ తన ఆనందాన్ని తెలియాజేశారు. మాకు పండంటి బాబు, పాప జన్మించిన శుభవార్తను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని  కుమారుడిని కలిగి ఉండటంతో మా ఫ్యామిలీ సంపూర్ణతను పొందింది. మాకు అపారమైన ఆనందాన్ని, కృతజ్ఞతను కలిగిస్తోంది అని అన్నారు. మన జీవితంలో మహిళలే అత్యంత బలం , ప్రేరణ. ఈ సంతోషకరమైన సమయంలో మాకు తోడుగా నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు , శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని రామ్ చరణ్‌  తెలిపారు.

సినిమాల విషయానికి వస్తే..

ప్రస్తుతం రామ్ చరణ్ బ్యాక్-టు-బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది (Peddi) లో చరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 సమ్మర్ కు విడుదల కానుంది.'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరో భారీ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి.