పెద్దపల్లి జిల్లా మినీ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హుండీ ఆదాయం లెక్కించారు ఆలయ అధికారులు. సారలమ్మ గుడి ఆవరణలో హుండీలను తెరిచి ఆదాయం లెక్కించారు. మొత్తం 44 హుండీలు లెక్కించగా రూ.31 లక్షల 26వేల 324 లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వేలంద్వారా రూ.19లక్షల 89వేలు, టికెట్ల ద్వారా 6లక్షల59వేల 560 రూపాయలు మొత్తం కలిపి 57లక్షల 74వేల 884 రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఇక రెండు గ్రాముల 900 మిల్లిగ్రాములు , 798 గ్రాముల వెండిని భక్తులు సమర్పించుకున్నట్లు చెప్పారు. గత జాతరకంటే 8లక్షల 86వేల195 రూపాయలు ఎక్కువగా వచ్చినట్లు ప్రకటించారు.
సారలమ్మ గుడి ఆవరణంలో జరిగిన హుండీల లెక్కింపులో పాల్గొన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎండోమెంట్ ఏ సి సుప్రియ, రామగుండం డిప్యూటీ ఎమ్మార్వో లక్ష్మి ,జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ
ఈవో కాంత రెడ్డి, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
