థాయ్‌‌‌‌లాండ్ మాస్టర్స్ టోర్నమెంట్‌‌‌‌ విమెన్స్ సింగిల్స్‌‌‌‌లో విన్నర్ గా దేవిక సిహాగ్‌‌‌‌

థాయ్‌‌‌‌లాండ్ మాస్టర్స్ టోర్నమెంట్‌‌‌‌  విమెన్స్ సింగిల్స్‌‌‌‌లో  విన్నర్  గా దేవిక సిహాగ్‌‌‌‌

బ్యాంకాక్‌‌‌‌: ఇండియా యంగ్ షట్లర్ దేవిక సిహాగ్‌‌‌‌  థాయ్‌‌‌‌లాండ్ మాస్టర్స్ టోర్నమెంట్‌‌‌‌  విమెన్స్ సింగిల్స్‌‌‌‌లో విజేతగా నిలిచింది. దాంతో కెరీర్‌‌‌‌‌‌‌‌లో తొలి బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ సూపర్ 300 టైటిల్‌‌‌‌ సొంతం చేసుకుంది. అన్‌‌‌‌సీడెడ్‌‌‌‌గా బరిలోకి దిగిన హర్యానాకు చెందిన 20 ఏండ్ల దేవిక ఆదివారం జరిగిన ఫైనల్లో 21–8తో తొలి గేమ్‌‌‌‌ ఈజీగా గెలిచి రెండో గేమ్‌‌‌‌లో 6–3తో లీడ్‌‌‌‌లో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి  గో జిన్ వీ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకుంది. దాంతో దేవిక టైటిల్ కైవసం చేసుకుంది.