పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పోయేకాలం దాపురించినట్లు ఉంది. టీ 20 వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడేది లేదని చెబుతూ.. తన బరితెగింపును చాటుకుంది. ఐసీసీ షెడ్యూల్ మొత్తం ఫిక్స్ అయ్యి.. వేదికలు ఖరారు అయిన తర్వాత.. భారత్ తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్తాన్ చెప్పటంతో.. ఇప్పుడు ఆ దేశంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది.. ఎంత నష్టం.. ఆప్షన్స్ ఏంటీ అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.200 కోట్ల నష్టం :
టీ 20 వరల్డ్ కప్ లో భారత్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోతే రెండు జట్లకు 200 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీస్తుంది. అంతేకాదు.. రాబోయే మిగతా మ్యాచ్ లపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాక్ వైఖరిపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఐసీసీ.. పాక్ జట్టును ఐసీసీ నిషేధించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఐసీసీ తీవ్రంగా చర్చిస్తుంది. నిర్ణయం మార్చుకోవాలని పాక్ జట్టుపై ఒత్తిడి చేస్తోంది. పాక్ తలొగ్గకపోతే ఆర్థికంగానే కాకుండా క్రికెట్ ప్రపంచం నుంచి నిషేధించే అవకాశాలు లేకపోలేదు.
ALSO READ : బ్యాడ్ న్యూస్.. ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ బాయ్‌కాట్
గ్రూప్ 1 నుంచే ఎలిమినేషన్ ప్రమాదం :
ఐసీసీ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ బహిష్కరిస్తే జట్టు రన్ రేట్ పై ప్రభావం చూపిస్తుంది. ఐసీసీ క్లాజ్ 16.10.7 ప్రకారం పాకిస్తాన్ జట్టుకు సున్నా పరుగుల కింద లెక్కిస్తారు. దీంతో పాక్ రన్ రేట్ నెగెటివ్ జోన్ లోకి వెళుతుంది. గ్రూప్ Aలో ఇండియా, పాక్, నమీబియా, నెదర్లాండ్స్, UAS జట్లు ఉన్నాయి. పాక్ మిగిలిన మూడు మ్యాచులు ఆడినా.. అందులో ఒక్క మ్యాచ్ ఓడినా గ్రూప్ దశ నుంచే ఔట్ అవుతుంది.
పాకిస్తాన్ పై నిషేధం విధించే అవకాశం :
ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఏ దేశంతో అయినా మ్యాచ్ బహిష్కరిస్తే.. ప్రపంచ కప్ నుంచే పాకిస్తాన్ జట్టును నిషేధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది ఐసీసీ. పాక్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రపంచ కప్ లో ఆడకుండా నిషేధం విధించే ఛాన్స్ ఉంది.
ALSO READ : కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడా రంగానికి బూస్ట్
నాకౌట్ స్టేజ్ విషయంలో క్లారిటీ లేదు :
గ్రూప్ A నుంచి బరిలోకి దిగబోతున్న పాకిస్తాన్ జట్టు.. భారత్ తో మ్యాచ్ ఆడకపోయినా.. మిగతా మూడు జట్లతో మ్యాచ్ ఆడి.. ఆ మూడు మ్యాచ్ లు గెలిస్తే.. నాకౌట్ దశకు చేరుకునే అవకాశం ఉంది. నాకౌట్ దశలో భారత్ తో మ్యాచ్ ఆడాల్సి వస్తే.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు పాకిస్తాన్. లీగ్ దశలో ఇండియాతో ఆడం అని చెప్పిన పాక్.. నాకౌట్ మ్యాచ్ పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఐసీసీలోనే గందరగోళం నెలకొంది. ఇది మొత్తం ప్రపంచ కప్ మ్యాచులపై ప్రభావం చూపిస్తుందని ఐసీసీ చెబుతోంది. పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఐసీసీ.
టీ 20 వరల్డ్ కప్ మ్యాచుల్లో లీగ్ దశలో ఇండియాతో ఆడేది లేదని పాకిస్తాన్ ప్రకటించటంతో.. ఇప్పటికే 200 కోట్ల రూపాయల వరకు ఆదాయం నష్టం అని అంచనా వేస్తుంది ఐసీసీ. అదే నాకౌట్ దశలోనూ ఇండియాతో ఆడం అని పాక్ ప్రకటిస్తే.. ప్రపంచ కప్ లో ఆడకుండా నిషేధం విధించే అవకాశం లేకపోలేదు.
