కేంద్ర బడ్జెట్‌‌‌‌ కేటాయింపుల్లో క్రీడా రంగానికి బూస్ట్

కేంద్ర  బడ్జెట్‌‌‌‌ కేటాయింపుల్లో క్రీడా రంగానికి  బూస్ట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌‌‌‌ కేటాయింపుల్లో క్రీడా రంగానికి బూస్ట్ లభించింది.  లోక్‌‌‌‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన  బడ్జెట్‍‌‌‌‌లో క్రీడా శాఖకు రూ. 4,479.88 కోట్లు కేటాయించారు. గతేడాది రూ. 3,346.52 కోట్లు (రివైజ్డ్‌‌‌‌) ఇచ్చిన ప్రభుత్వం ఈసారి అదనంగా రూ. 1133.44 కోట్లు పెంచింది. తాజా బడ్జెట్‌‌‌‌లో  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌‌‌‌) రూ. 917.38 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు రూ. 425 కోట్లు అందుకుంటాయి.  ఈసారి కొత్తగా క్రీడా పరికరాల తయారీ రంగానికి రూ. 500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అత్యుత్తమ నాణ్యత, అందుబాటు ధరలతో కూడిన క్రీడా పరికరాల తయారీ హబ్‌‌‌‌గా  ఇండియాను మార్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, రాబోయే దశాబ్ద కాలానికి శిక్షణ కేంద్రాల అభివృద్ధి, కోచ్‌‌‌‌లు, సపోర్ట్ స్టాఫ్‌‌‌‌ను తీర్చిదిద్దేందుకు  ఖేలో ఇండియా మిషన్‌‌‌‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.