భూదాన్‌‌ భూముల రక్షణ చర్యలను వివరించండి : హైకోర్టు

భూదాన్‌‌ భూముల రక్షణ చర్యలను వివరించండి : హైకోర్టు
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌లోని సర్వే నం.695లో గల భూదాన్‌‌ భూముల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇందులో 3.34 ఎకరాల భూమిని నివాస ప్రాంతానికి లేఔట్​కు అనుమతించడాన్ని సవాలు చేస్తూ గజ్వేల్‌‌కు చెందిన జంగం రమేశ్‌‌ గౌడ్‌‌ హైకోర్టులో పిల్‌ వేశారు.  

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గజ్వేల్‌‌లోని సర్వే నం.695లో మొత్తం 11.24 ఎకరాల భూదాన్‌‌ భూమిలో 3.34 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేసి నివాస లేఔట్‌‌ను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వ్యాపారవేత్త మల్లారెడ్డి స్థానిక అధికారులతో కుమ్మక్కై భూదాన్‌‌ భూమి కన్వర్షన్‌‌కు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారన్నారు. భూదాన్‌‌ భూమిని నిషేధిత జాబితాలో చేర్చకుండా ప్రైవేటు వ్యక్తులకు అధికారులు సహకరిస్తున్నారన్నారు.  వాదనలు విన్న హైకోర్టు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌‌ఏ, హెచ్‌‌ఎండీఏ కమిషనర్, కలెక్టర్‌‌తోపాటు మల్లారెడ్డికీ నోటీసులిచ్చింది.