కాగజ్‌నగర్, వెలుగు: ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, గ్రామ స్వరాజ్య సాధనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదిలాబాద్ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్‌జిల్లా కౌటాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హరీశ్‌బాబుతో కలిసి హాజరయ్యారు. మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్య, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, ఎంపీడీవో కోట ప్రసాద్, సహకార సంఘం చైర్మన్ మాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
భాగ్యనగర్ లింక్ బస్సు సౌకర్యం కల్పించండి
కౌటాల: మారుమూల గ్రామాల్లోని ప్రజలు, విద్యార్థులకు కీలకమైన భాగ్యనగర్ రైలుకు లింక్ బస్సు సర్వీస్ ప్రారంభించేలా చూడాలని కౌటాల మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ విఠల్‌ను కోరారు. కౌటాలలో వినతిపత్రం ఇచ్చిన మాట్లాడారు. భాగ్యనగర్ రైలులో కాగజ్‌నగర్‌కు చేరుకునే కౌటాల, సిర్పూర్ (టి), చింతల మానేపల్లి మండలాలవారికి రాత్రి వేళ రవాణా సౌకర్యం లేక అక్కడే బస చేయాల్సి వస్తోందని వివరించారు. స్పందించిన ఎమ్మెల్సీ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి లింక్ బస్సు సర్వీసు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
