- భారీగా ఏటీఎం, ఆధార్, పాన్ కార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు: సైబర్ నేరస్తులకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. జీడిమెట్ల గాజులరామారం ద్వారకానగర్‌లోని శ్రీ గణేశ్నిలయంలో ఈ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు. శ్రీ గణేశ్ నిలయంలో నివాసం ఉండే దుర్గాప్రసాద్ గూగుల్ పే స్కాన్సేల్స్ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. సనత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి గూగుల్ పే టీం లీడర్‌గా చేస్తున్నాడు.
చెంగిచెర్ల సాయినగర్‌కు చెందిన రమణ జెప్టో రైడర్. చర్చ్గాగిళ్లాపూర్కు చెందిన సింహాద్రి అనిల్ మనీ ట్రాన్స్ఫర్ఐడీ సప్లయర్. మరొకరు ఉప్పల్ స్వరూప్ నగర్‌కు చెందిన బాలరాజు. అందరూ కలిసి గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. అమాయక ప్రజలను బెదిరించి, వారి బ్యాంక్అకౌంట్ల వివరాలు, మరికొందరికి డబ్బులు ఇస్తామని వారి ఆధార్, పాన్ కార్డుల వివరాలు సేకరిస్తున్నారు. వాటితో ఫేక్ లేబర్ లైసెన్సులు, రెంట్అగ్రిమెంట్లు, అడ్రస్ ప్రూఫ్‌లు క్రియేట్ చేస్తున్నారు.
ఆ తర్వాత ఈ డాక్యుమెంట్లతో బ్యాంక్అకౌంట్లను ఓపెన్చేస్తారు. అకౌంట్ హోల్డర్లకు కమీషన్ ఇచ్చి, ఈ మ్యూల్బ్యాంక్ఖాతాలను సైబర్నేరస్తులకు సరఫరా చేస్తున్నారు. పోలీసుల కంట పడకుండా ఎప్పటికప్పుడు తమ అడ్రస్‌లు మారుస్తున్న ఈ ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్‌చేశారు.
నిందితుల వద్ద నుంచి భారీ సంఖ్యలో బ్యాంక్పాస్బుక్లు, ఏటీఎం, ఆధార్, పాన్ కార్డులు, క్యూఆర్ స్కానర్లు, స్వైపింగ్ మెషీన్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
