T20 World Cup 2026: ఐసీసీ ప్రోటోకాల్స్‌ పాటించాల్సిందే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ రోజు శ్రీలంకకు టీమిండియా

T20 World Cup 2026: ఐసీసీ ప్రోటోకాల్స్‌ పాటించాల్సిందే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ రోజు శ్రీలంకకు టీమిండియా

క్రికెట్ ఫ్యాన్స్ కు 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ చూసే అవకాశం లేకుండా పోయింది. వరల్డ్ కప్‎లో భాగంగా 2026, ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఇండియాతో జరగనున్న మ్యాచ్ ఆడొద్దని దాయాది దేశం నిర్ణయించుకుంది. టోర్నీ మరో వారం రోజుల్లో ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ షెడ్యూల్ మొత్తం ఫిక్స్ అయ్యి.. వేదికలు ఖరారు అయిన తర్వాత.. భారత్ తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్తాన్ చెప్పటంతో ఇప్పుడు దాయాధి జట్టుపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సస్పెన్స్ మొదలైంది. 

టీ20 వరల్డ్ కప్ పాల్గొనేందుకు పాకిస్తాన్ టీమ్‎కు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు మాత్రం నో చెప్పింది. ఇండియాతో తప్ప టోర్నీలో మిగిలిన అన్ని మ్యాచ్ లు ఆడతామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. మొత్తం టోర్నీని బహిష్కరిస్తే భారీగా ఆర్ధిక నష్టం వస్తుందనే భయంతోనే పాక్ ఈ జిత్తులమారి ప్లాన్ వేసినట్లు క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండియాపై మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్ తమ పాయింట్స్ వదులుకోవాల్సిందే. అంటే మ్యాచ్ ఆడకుండా తాము ఇండియాకు పాయింట్స్ వదిలేసుకున్నట్టు పాకిస్థాన్ స్పష్టం చేసింది. 

ఐసీసీ ప్రోటోకాల్స్‌ను బీసీసీఐ పాటించాలి:

బీసీసీఐ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వాదనలను విస్మరించాలని నిర్ణయించింది. పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకపోయినా టీమిండియా ఐసీసీ ప్రోటోకాల్స్‌ పాటించాల్సి ఉంది. పాకిస్థాన్ తో మ్యాచ్ రోజు టీమిండియా యధావిధిగా శ్రీలంకకు వెళ్లి మ్యాచ్ కు సిద్ధమవుతుంది. మ్యాచ్ కు ముందు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు మన జట్టు ప్లేయర్స్ హాజరవుతారు. అదేవిధంగా ప్రాక్టీస్ సెషన్‌లలోనూ పాల్గొంటారు. మ్యాచ్ జరగబోయే రోజు సూర్యకుమార్ యాదవ్ టాస్ కోసం గ్రౌండ్ లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ రిఫరీ ఆటను రద్దు చేసే వరకు బీసీసీఐ తమ ప్రోటోకాల్స్ ను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

►ALSO READ | భారత్ తో పాకిస్తాన్ ఆడకపోతే రూ.200 కోట్లు నష్టం.. పాక్ పై బ్యాన్ విధిస్తారా.. నాకౌట్ లో ఏం జరగబోతుంది..?

"టీమిండియా శ్రీలంకకు వెళ్లి ఐసీసీ ప్రోటోకాల్‌ను అనుసరిస్తుంది. జట్టు షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తారు. విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. మ్యాచ్ సమయానికి స్టేడియంకు చేరుకుంటారు. మ్యాచ్ రిఫరీ మ్యాచ్‌ను రద్దు చేసే వరకు వేచి ఉంటారు". అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీమిండియాతో మ్యాచ్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేసినా భారత క్రికెట్ జట్టు మాత్రం ఐసీసీ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా నడుచుకుంటుంది. 

ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్:

2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగడం లేదు. 

భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.