రెబల్స్ ఉండొద్దు..గెలుపు మనదే.. మున్సిపోల్స్ పై సీఎం రేవంత్ దిశానిర్దేశం

రెబల్స్ ఉండొద్దు..గెలుపు మనదే.. మున్సిపోల్స్ పై సీఎం రేవంత్ దిశానిర్దేశం

మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న మంత్రులు, పీఏసీ నేతలతో  సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్,  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు, పీఏసీ సభ్యులు ఈ మీటింగ్ లో  పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై  నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ . మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని నేతలకు సూచించారు . 

‘మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మనదేనని..సర్వేలు మంచి మెజారిటీ తో గెలుస్తున్నాం అనే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నాయి. అంతా సమిష్టిగా కృషి చేయాలి. రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి.
పార్టీ కోసం పని చేసిన వాళ్లను గెలిపించుకోవాలి. టికెట్ లు రాని బలమైన నాయకులు ఉంటే కార్పొరేషన్ పదవుల్లో అవకాశం ఇద్దాం అని హామీ ఇవ్వండి. అభ్యర్థిని ఖరారు చేసిన వాళ్లే గెలుపు బాధ్యత తీసుకోవాలి. ప్రతీ అభ్యర్థి లోకల్ గా మేనిఫెస్టో రెడీ చేసుకోవాలి.  బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ ఇచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలి’. అని రేవంత్ నేతలకు దిశానిర్దేశం చేశారు .

మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనుండగా..13న కౌంటింగ్ జరగనుంది. ఈ క్రమంలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 4 నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.