బడ్జెట్ తర్వాత వీటి ధరలు పెరుగుతాయి.. ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి.. ఫుల్ లిస్ట్ ఇదే..!

బడ్జెట్ తర్వాత వీటి ధరలు పెరుగుతాయి.. ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి.. ఫుల్ లిస్ట్ ఇదే..!

కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తో.. కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ వస్తువుల ధరల్లో మార్పులు ఉంటాయి. వాటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రాథమిక కస్టమ్స్ సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) మినహాయింపులను ప్రకటించారు. దీని వలన అనేక డిఫెన్స్ రంగానికి సంబంధించిన  పరికరాలు, మందులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు (హెల్త్ కేర్) , ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. 

ఇప్పటి వరకు కొన్ని దిగుమతులకు ఉన్న కస్టమ్స్ డ్యూటీ మినహాయింపుల సదుపాయాన్ని లెదర్, సింథటిక్ ఫూట్ వేర్ ఎగుమతులకు వర్తింపజేయనున్నట్లు చెప్పారు ఆర్థిక 

ధరలు తగ్గే వస్తువులు ఇవే:

  • మైక్రోవేవ్ ఓవెన్‌ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు
  • క్యాన్సర్‌తో సహా ప్రాణాంతక వ్యాధులలో ఉపయోగించే 17 మందులు
  • లెదర్ ఉత్పత్తులు
  • క్రీడా పరికరాలు
  • విదేశీ విద్య
  • మొబైల్ ఫోన్లు
  • EV బ్యాటరీలు
  • సోలార్ ప్లేట్స్
  • విదేశీ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజీలు, విదేశీ ఖర్చులపై పన్ను వసూలు (TCS) 2 శాతానికి తగ్గించారు.

ధరలు పెరిగే వస్తువులు ఇవే:

  • మద్యం
  • సిగరెట్లు
  • పాన్ మసాలా
  • ఖనిజాలు
  • స్టాక్ మార్కెట్  ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ లో వచ్చే లాభాలపై పన్ను పెంపు
  • గడియారాలు

2026-27 సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 4.3 శాతానికి తగ్గించే అవకాశం ఉందని సీతారామన్ అంచనా వేశారు. 2025-26 బడ్జెట్‌లో ద్రవ్యలోటును 4.4 శాతానికి తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు చెప్పారు. అదే క్రమంలో  2026-27 ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గిస్తామని ఆమె చెప్పారు.

ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, ఉద్యోగాలను పెంచడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి 2026-27 బడ్జెట్‌లో పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా రూ. 12.2 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రకటించారు.