శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. మంత్రులు.. అధికారులు సమీక్షా సమావేశం

శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. మంత్రులు.. అధికారులు సమీక్షా సమావేశం

మహా శివరాత్రి పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో శ్రీశైలం క్షేత్రానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం ఆలయంలో సన్నాహాలు ముమ్మరం చేశారు. మూడు రోజుల పండుగ సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 15న మహా శివరాత్రి ఉంది.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై ఏపీ మంత్రులు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు అనిత,బీసీ జనార్దన్ రెడ్డి,ఆనం రాం నారాయణ రెడ్డి,జిల్లా ఉన్నతాధికారులు, ఈవో,చైర్మన్  పాల్గొన్నారు. గత సంవత్సరం దేవస్థానం నిర్వహించిన ఏర్పాట్లు,వాహనసేవలను స్క్రీన్​ ప్రజంటేషన్  ఇచ్చారు. ఈ ఏడాది  చేపట్టనున్న ఏర్పాట్లు,పూజ కైకార్యాలపై మంత్రులకు అధికారులు ఈవో శ్రీనివాసరావు  విస్తరించారు.

►ALSO READ | కేంద్ర బడ్జెట్ సరికొత్త వ్యూహం.. మిత్రపక్షాల డిమాండ్లకు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఎవరికి ఏం ఇచ్చారంటే..?

 దక్షిణ భారతదేశంలో ప్రధాన శివరాత్రి గమ్యస్థానాలలో ఒకటిగా శ్రీశైలం ఉంది. పండుగ సమయంలో శ్రీశైలంలో భారీగా జనసందోహం చూసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తుల సంఖ్య పెరిగే నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ శాఖల సంయుక్త పర్యవేక్షణలో విస్తృతమైన ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నారు. . భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి క్యూ లైన్లను క్రమబద్ధీకరించడం, రద్దీని మెరుగుపరచడంపై అధికారులు దృష్టి సారించారు.