పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా

పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా

పాక్ ఆక్రమిత-కశ్మీర్ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. మే 15వ తేదీ బుధవారం అమిత్ షా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. పీఓకే, భారతదేశంలో అంతర్భాగమని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మే 10 నుంచి చెలరేగిన నిరసనలపై అమిత్ షా స్పందిస్తూ.. "అక్కడ నిర్వహణ లోపం ఉంది, అది వారి విషయం...కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాది, ఎందుకంటే మొత్తం కాశ్మీర్‌.. ఇండియన్ యూనియన్ తో కలిసిపోయి ఉంది" అని చెప్పారు.

పిఒకెను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిబద్ధతతో ఉందని చెప్పారు షా. పాకిస్తాన్ పట్ల శాంతింపజేసే విధానాన్ని సూచించడంపై ప్రతిపక్ష పార్టీలను ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా  గతంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యను ఆయన ప్రస్తావించారు.  భారతదేశం.. "పాకిస్తాన్‌ను గౌరవించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వారి వద్ద అణుబాంబు ఉంది" అని ఫరూక్  అన్నారని.. "1.3 బిలియన్ల జనాభా కలిగిన భారత్, ఒక అణుశక్తి అని.. ఎవరికైనా భయపడుతుందా?,  తన హక్కును వదులుకుంటుందా? అని ప్రశ్నించారు.

పాకిస్థాన్‌ విషయంలో తమ కూటమి నేతలు ఏం చెబుతున్నారో రాహుల్ బాబా దేశానికి వివరించాలన్నారు. పీఓకేను స్వాధీనం చేసుకోవడం.. బీజేపీనిబద్ధత మాత్రమే కాదని, దేశ పార్లమెంట్ నిబద్ధత కూడా అని ఆయన చెప్పారు. పీఓకేపై మాకు హక్కులు ఉన్నాయని... దానిని ఎవరూ కాదనలేరని అమిషా అన్నారు.