వెనిజులా ఆయిల్ నిల్వలపై తాము ఆధిపత్యం సాధించామని.. తమ నియంత్రణలోనే చమురు నిల్వల ఎగుమతులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మరుక్షణమే.. ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్. అమెరికాది ఇంధన దురాశ అని.. దురాశతోనే ఇందంతా చేస్తున్నారని మండిపడ్డారు. వెనిజుల ప్రసిడెంట్ నికోలస్ మదురోను మాదకద్రవ్యాల అక్రమ రవాణా,మానవ హక్కుల ఉల్లంఘనల పేరున అదుపులోకి తీసుకున్నారని.. అవన్నీ తప్పుడు ఆరోపణలకింద కొట్టిపారేశారు
వెనిజులా పార్లమెంటును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. మేము నిజంగా ఒక శక్తి కేంద్రం. మా దగ్గర అపారమైన ఇంధన నిల్వలున్నాయి. ఇది మాకు అనేక సమస్యలను తెచ్చిపెట్టింది, ఎందుకంటే ఉత్తరాది ఇంధన దురాశ మన దేశ వనరులను కోరుకుంటుందని మీ అందరికీ తెలుసు.. అంటూ తీవ్ర ఆవేదనతో.. అమెరికాపై ఆక్రోషంతో మాట్లాడారు.
వెనిజులా ప్రభుత్వం నుండి అమెరికా పూర్తి సహకారాన్ని పొందుతోందని, దాని చమురు నిల్వలపై సంవత్సరాల తరబడి నియంత్రణను కొనసాగిస్తుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత రోడ్రిగ్జ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము అవసరమని భావించే ప్రతిదాన్ని వెనిజులా ఇస్తుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : ఈ తరం కుర్రోళ్ల అప్పుల వెనక షాకింగ్ నిజాలు
అమెరికాతో ఏకపక్ష ఒప్పందాన్ని తోసిపుచ్చారు తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్. ఇరు వైపులా ప్రయోజనం పొందేలా వాణిజ్య, ఇంధన సహకారానికి ఒప్పుకుంటామని.. కానీ.. దురాశతో దోపిడీ కుట్రలను తిప్పి కొడతామని హెచ్చరించారు.
వెనిజులాతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ చమురు మార్కెట్‌ను తెరవాలనే వెనిజులా నిర్ణయాన్ని రోడ్రిగ్జ్ సమర్థించారు. మాజీ ప్రసిడెంట్ మదురోను తొలగించడానికి అమెరికా చేసిన ప్రయత్నం ఇరుదేశాల మధ్య సంబంధాలపై మాయని మచ్చలా నిలిచిందని అన్నారు.
ఇటీవలి పరిణామాల క్రమంలో అమెరికా దళాలు ఆంక్షల కింద రెండు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నాయి. వెనిజులా ముడి చమురు అమ్మకాలను పర్యవేక్షించడానికి, ప్రపంచతో పెట్రోలియం వ్యాపారాలను నిర్వహించడానికి అమెరికా అధికారులు ప్రణాళికలను ప్రకటించారు. ఈ చర్య వెనిజులా ఆయిల్ సెక్టార్ నియంత్రణ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తుందనే చెప్పాలి.
చాలా డబ్బు సంపాదిస్తామని ట్రంప్ సంచలన ప్రకటన !
అంతకుముందు యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ చేసిన ప్రకటన వెనిజులా ఆగ్రహానికి దారితీసింది. వెనిజులా ఆయిల్ నిల్వలు తమ ఆధీనంలో ఉన్నాయని.. దీంతో చాలా డబ్బు సంపాదిస్తామని ట్రంప్ ప్రకటించారు. లాటిన్ అమెరికా దేశం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధీగా పట్టుకున్న కొద్ది రోజులకే ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులాపై పూర్థి ఆధిపత్యం సాధించామని అన్నారు. వెనిజులా ఆయిల్ నిల్వలు పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చాయని.. ఇక నుంచి అమెరికా చాలా డబ్బు సంపాదిస్తుందని సంచలన ప్రకటన చేశారు.
న్యూయార్క్ టైమ్స్ తో మాట్లాడుతూ.. అమెరికా మున్ముందు మంచి రోజులు చూస్తుందని పేర్కొన్నారు ట్రంప్. వెనిజుల తాత్కాలిక ప్రసిడెంట్ డెల్సీ రోడ్రిగెజ్ ప్రభుత్వానికి శుభపరిణామం అని ట్రంప్ అన్నారు. వెనిజులాలో అమెరికన్ ఆయిల్ కంపెనీలు.. అక్కడి మౌలిక కల్పనలను పునర్మిస్తామని.. చెప్పారు. లాటిన్ అమెరికాను నడపడంలో తమపై ఎలాంటి భారం పడదని అన్నారు.
వెనిజులాను ఎన్నాళ్లు అధీనంలో ఉంచుకుంటారని అడిగిన ప్రశ్నకు.. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది లేదా.. చాలా రోజులు అన్నట్లు ట్రంప్ చెప్పారు.
ఇటీవలే అమెరికా అధికారులు కూడా ఇలాంటి స్టేట్ మెంట్స్ చేశారు . వెనిజులాను యూఎస్ చాలా వరకు గుప్పెట్లో ఉంచుకుంటుందని.. కరాకస్ ఆయిల్ నిల్వలను, ఎగుమతులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని తెలిపారు. వెనిజుల ఆయిల్ సెక్టార్ పై ఉన్న సాంక్షన్స్ ను ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు.
క్రూడ్ ఆయిల్ వెలికితీయడం, అమ్మడం జరుగుందని.. అమెరికా ఎనర్జీ సెక్రెటరీ క్రిస్ వైట్ బుధవారం (జనవరి 07) అన్నారు. ముందుగా స్టోర్ చేసిన ఆయల్ అమ్ముకుని.. ఆ తర్వాత ఉత్పత్తి పెంచుతామని చెప్పారు.
