- ఆలయ బోర్డు, షెడ్లు ధ్వంసం
పాల్వంచ,వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కెపి జగన్నాధపురం లో ఉన్న కనక దుర్గమ్మ (పెద్దమ్మ తల్లి) దేవాలయం ప్రాంగణంలో ఐదు దశాబ్దాల నాటి భారీ వృక్షం శనివారం అర్ధరాత్రి వీచిన గాలి దుమారా నికి నేలకొలింది. ఆలయం పక్కనే ఉన్న ఈ చెట్టు చుట్టూ దేవాలయ కమిటీ సిమెంటు నిర్మాణం చేపట్టి మార్బుల్స్ వేశారు. మహిళా భక్తు లు పిల్లలు కలగాలని ఈ చెట్టుకు ఊయలలు కట్టి పూజలు చేయడం ఆనవాయితీ.
అయితే కూలిన చెట్టు కొమ్మలు పక్కనే ఉన్న గుడి రేకుల షెడ్డు డిజిటల్ బోర్డు పై పడటంతో బోర్డు ,షెడ్డు ధ్వంసం అయింది. పక్కనే ఉన్న విద్యుత్తు వైర్లు తెగిపోయి స్తంభం కూలి పో యింది. వేసవికాలంలో ఈ వృక్షం భక్తులకు నీడకు ఆసరాగా నిలిచేది. కేపీ జగన్నాధపురం పంచాయ తీ, ఆలయ సిబ్బంది చెట్ల కొమ్మలు తొలగించి మరమ్మతులు చేపట్టారు .
Palvancha temple news, Peddamma Thalli temple, tree falls, Bhadradri Kothagudem, Kanaka Durgamma temple, Latest News, Telugu News, Telangana News, Hyderabad News, V6 News
