ఏటీఎం మిషన్ లో పాము

ఏటీఎం మిషన్ లో పాము

ఎర్రటి ఎండల నుంచి సేద తీరేందుకు పాములు పబ్లిక్ ప్రాంతాల్లోకి ప్రత్యక్షమవుతున్నాయి. అలా సేద తీరేందుకు ఓ పాము ఏటీఎం లో చొరబడడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ ఏటీఎం సెంటర్ లో పాము కలకలం సృష్టించింది. ఘజియాబాద్ గోవింద్ పురికి  చెందిన ఓ ఏటీఎం మెషిన్ లోకి పాము చొరబడింది. ఎప్పటిలాగా సెక్యూరిటీ గార్డ్ ఏటీఎం సెంటర్ డోర్ ఓపెన్ చేయగా  పాము ప్రత్యక్షమైంది. దీంతో భయాందోళనకు గురైన కష్టమర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు.

అయితే ఏటీఎం సెంటర్ లో ఉన్న పాము భయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసినా సాధ్యపడకపోయే సరికి మళ్లీ ఏటీఎం మెషిన్ లోకి చొరబడింది. ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

మరోవైపు పామును రక్షించేందుకు కష్టమర్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పామును అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఏటీఎం సెంటర్ లో పాము ప్రత్యక్షమవ్వడంతో నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.

ఓ నెటిజన్ ఇలా ఆ పాము డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిందేమో..ఎందుకు అలా భయపెడుతున్నారు అంటూ కామెంట్ చేశాడు.

మరో నెటిజన్ ఆ పామును చూస్తుంటే భయమేస్తుంది. ఎండల్లో రిలాక్స్ అవుదామని ఏటీఎం సెంటర్ కు వచ్చిందంటూ చమత్కరిస్తున్నారు.