బేకరీలో కొలువుదీరిన చాక్లెట్ బొజ్జ గణపయ్య

బేకరీలో కొలువుదీరిన చాక్లెట్ బొజ్జ గణపయ్య

పర్యావరణ హిత వినాయక విగ్రహాల ప్రచారంలో భాగంగా ఎక్కువ మంది మట్టి విగ్రహాలనే వాడుతున్నారు. అయితే పంజాబ్ లోని లుథియానాకు చెందిన ఓ బేకరీ ఓనర్ కొత్తగా ఆలోచించారు. ఎక్కడా లేని విధంగా.. చాక్లెట్‌తో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి, పూజించారు.బేకరీకి చెందిన షెఫ్‌లు ఎంతో శ్రమించి చాక్లెట్‌తో చూడ ముచ్చటైన బొజ్జ గణపయ్య విగ్రహాన్ని తీర్చి దిద్దారు. అయితే ఇలా తాము 2015 నుంచి చాక్లెట్‌ గణపతిని తయారు చేస్తున్నామని, ఎకో ఫ్రెండ్లీ గణేశుడిని పూజించాలన్న మెసేజ్‌ అందరికీ చేరవేయాలన్నదే తమ ఉద్దేశమని బేకరీ ఓనర్ హర్‌‌జీందర్‌‌ సింగ్‌ కుక్రేజా తెలిపారు.