ఫ్రీగా ఆధార్ అప్డేట్‌

ఫ్రీగా ఆధార్ అప్డేట్‌

స్టూడెంట్స్‌‌కు మాత్రమే

ఎన్‌‌రోల్‌‌మెంటూ ఉచితమే

రెండేళ్లలో 64 లక్షల మంది వివరాలు తీసుకోవాలని టార్గెట్‌‌

రెండు ఏజెన్సీలకు కాంట్రాక్టు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఐదు నుంచి18 ఏండ్లలోపు స్టూడెంట్స్​ఆధార్​ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌తోపాటు వివరాల అప్‌‌డేట్‌‌ను ఫ్రీగా చేయనున్నారు. రెండేండ్లలో స్టేట్‌‌లోని 64 లక్షల మందికి ఈ సౌకర్యం కల్పించాలని స్కూల్​ఎడ్యుకేషన్​ప్లాన్ చేసింది. దీనికోసం కొత్తగా 876 ఆధార్​కిట్స్ కొని రెండు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించింది. స్టూడెంట్స్‌‌ ఆధార్‌‌ కార్డుల్లో తప్పులున్నా ఫ్రీగానే అప్డేట్​చేసిస్తారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల క్రితం ఎడ్యుకేషన్‌‌ మినిస్టర్‌‌ సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. త్వరలోనే ఇది అన్ని జిల్లాల్లో ప్రారంభం కానుంది.

స్టేట్‌‌లో 18 ఏండ్లలోపు స్టూడెంట్స్‌‌ 65 లక్షల 29 వేల 072 మంది ఉన్నారు. వీరిలో  లక్షా 960 మంది ఆధార్​ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ మాత్రమే పూర్తయింది. మిగిలిన 64 లక్షల 28 వేల 112 మందికి చేయించాల్సి ఉంది. ఏటా కొత్తగా స్కూల్‌‌లో చేరే స్టూడెంట్స్‌‌లో చాలా మందికి ఆధార్ నంబర్లు ఉండట్లేదు. ఆధార్​కార్డు ఉన్న వారిలోనూ ఫింగర్​ప్రింట్స్, ఐరిస్, ఫొటోలు సరిపోలడం లేదు. వాటిని అప్డేట్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ పనిని ఎంఈఓ ఆఫీసుల్లో పనిచేసే ఎంఐఎస్​ కోఆర్డినేటర్లు చేశారు. స్టేట్‌‌లో 467 మండలాల్లో వారికి ఆధార్​కిట్స్​కూడా ఉన్నాయి. అయితే ఎంఐఎస్​కోఆర్డినేటర్లు స్కూళ్లకు వెళ్లి, ఆధార్​ఎన్‌‌రోల్​మెంట్, అప్డేట్​చేయించడం కష్టంగా మారింది. దీంతో ఆ బాధ్యతలను ఎస్ఎన్ఆర్​ఈడేట్స్​ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌, విరించి లిమిటెడ్ సంస్థలకు అప్పగించారు.

టార్గెట్ రెండేండ్లు

ఎస్ఎన్ఆర్​సంస్థ ఉమ్మడి కరీంనగర్, మహబూబ్‌‌నగర్, మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, హైదరాబాద్​జిల్లాలకు చెందిన 32.59 లక్షల మంది స్టూడెంట్స్‌‌ వివరాల్ని అప్​డేట్ చేయాల్సి ఉంది. దీనికోసం కొత్తగా 526 ఆధార్​కిట్స్​ను విద్యాశాఖ కొన్నది. విరించి సంస్థ ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్‌‌, వరంగల్ జిల్లాల్లోని 25.51 లక్షల స్టూడెంట్స్​వివరాలను అప్​డేట్​చేయాల్సి ఉంది. దీనికోసం 350 కొత్త ఆధార్​కిట్స్​ను కొన్నారు. ఆయా సంస్థలు డేటా అప్టేడ్, ఎన్‌‌రోల్‌‌ను రెండేళ్లలో పూర్తి చేయాలి.  కొత్తగా కొన్న 876 కిట్లలో  730 కిట్లను ఇప్పటికే జిల్లాలకు పంపించారు.