ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన ఆప్ ఎంపీ

ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన  ఆప్ ఎంపీ

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కొత్త అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్  వీక్ షోలో ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు. అంతేకాదు ఈ షో స్టాపర్‌గా మారారు.33 ఏళ్ల రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా..నటుడు అపరశక్తి ఖురానాతో కలిసి డిజైనర్ పవన్ సచ్‌దేవా కోసం ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. రాఘవ్ చద్దా హై-నెక్ స్వెట్‌షర్ట్, ఆరెంజ్ బెల్ట్‌, నలుపు రంగు లెదర్ జాకెట్‌ను ధరించి ర్యాంప్ వాక్ చేశారు.ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విజయంలో రాఘవ్ చద్దా కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనను పార్టీ హైకమాండ్ రాజ్యసభకు పంపించింది.దీనికి సంబంధించిన వీడియోను రాఘవ్ చద్దా ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం రాఘవ్ చద్దా ఫొటోలు, వీడియోల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని వార్తల కోసం
ఒక్కటైన  పీవీఆర్, ఐనాక్స్‌

వారియర్ వస్తున్నాడు