వారియర్ వస్తున్నాడు

వారియర్ వస్తున్నాడు

వరుస మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్స్ చేస్తున్న రామ్, ఫస్ట్ టైమ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీసాఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించబోతున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘ద వారియర్’ పేరుతో లింగుస్వామి రూపొందిస్తున్నాడు.  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి జంటగా కృతీశెట్టి నటిస్తోంది. ఆది పినిశెట్టి విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోషిస్తున్నాడు. అక్షర గౌడ కీలక పాత్ర చేస్తోంది. షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శరవేగంగా జరుగుతోంది. జులై 14న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. అలాగే రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని  కూడా రివీల్ చేశారు. రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ చెక్క పెట్టెమీద కూర్చుని ఉన్నాడు రామ్. చేతికి గాయమై కట్టు కట్టి ఉంది. ఆ గాయం నుంచి రక్తం కారుతోంది. అదే చేతితో గన్ పట్టుకుని సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూస్తున్నాడు. శత్రువుల్ని వేటాడటానికి సింహంలా పొంచి ఉన్నట్టు కనిపిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.