మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) వరుస సినిమాలతో బిజీబిజీగా మారింది. ఈ పదేళ్ల కాలంలో మలయాళం, తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో నటించి క్రేజీ అభిమానులను సొంతం చేసుకుంది. 2025లోనే దాదాపు ఏడు సినిమాల వరకు నటించి తన సత్తాను చాటుకుంది. తెలుగులో టిల్లు స్క్వేర్ సినిమాలో లిప్ లాక్ లతో నానా హైరానా చేసిన అనుపమ, పరదా వంటి సోషల్ డ్రామాలో నటించి మెప్పించింది.
అంతేకాకుండా కిష్కింధపురి (తెలుగు) వంటి హార్రర్ మూవీ చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే, 2025లో డ్రాగన్ (తమిళం), జానకి వర్సెస్ స్టేట్ ఆఫ కేరళ (మలయాళం), ది పెట్ డిటెక్టివ్ (మలయాళం), బైసన్ (తమిళం), లాక్ డౌన్ (తమిళం) సినిమాలతో ఆడియన్స్ను పలకరించి తన సత్తా చాటుకుంది.
ఇక 2026లోనూ ఏ మాత్రం తగ్గేదేలే అనేలా వరుసబెట్టి సినిమాలు చేస్తూ మెప్పించడానికి రెడీ అయింది.
లేటెస్ట్గా టాలీవుడ్ డైరెక్టర్ కం హీరోతో అనుపమ ఓ ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆరో సినిమాస్ ప్రొడక్షన్ హౌస్ ‘క్రేజీ కళ్యాణం’ అనే టైటిల్తో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించింది. ‘100% వినోదంతో ఇప్పటివరకు చూడని అత్యంత క్రేజీ కాంబినేషన్’ అని ఆరో సినిమాస్ ప్రొడక్షన్ కంపెనీ మూవీ విషయాలు వెల్లడించింది.
Here's @ArrowCinemas - Production No:2 #CrazyKalyanam 🤗😅
— ArrowCinemas (@ArrowCinemas) January 5, 2026
CRAZIEST COMBINATION EVER,
WITH 100% ENTERTAINMENT 😍@ItsActorNaresh 🥳 @anupamahere ♥️#TharunBhascker 🙌🏼 @akhilrajuddemar 🥁
Written & Directed by #BadrappaGajula 🎬
Produced by @Boosam_JMReddy 💰 pic.twitter.com/JDo56nGN8t
ఈ సందర్భంగా ఇందులో అనుపమ-తరుణ్ భాస్కర్ జంటగా నటిస్తున్నట్లు తెలిపింది. టైటిల్కు తగ్గట్టుగానే క్రేజీ కాంబినేషన్ని సెట్ చేసి, సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ వీకే, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తుండగా, ఆరో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
