వ్యక్తిగా బయటకు వెళ్లి శక్తిగా చట్టసభల్లోకి తిరిగొస్తానని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తన రాజకీయ ప్రస్థానంపై శాసనమండలిలో భావోధ్వేగానికి గురైన కవిత..నైతిక లేని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను కోరారు కవిత. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందన్నారు . బీఆర్ఎస్ లా కాంగ్రెస్ పాలన చేయకూడదని సూచించారు. పదవికి రాజీనామా చేసినా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు . అపుడు ప్రశ్నించా..ఇపుడు ప్రశ్నించా..రేపు కూడా ప్రశ్నిస్తా..మీరందరి ఆశీర్వాదంతో చట్టసభలకు శక్తిగా తిరిగొస్తానన్నారు కవిత.
కవిత కీలక వ్యాఖ్యలు
- నా రాజీనామాను ఆమోదించండి
- మండలిలో మాట్లాడేందుకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు
- అన్ని ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నా
- బీఆర్ఎస్ నుంచి అనేక కట్టుబాట్లు ఎదురయ్యాయి
- అందుకే ఆ పార్టీకి, మండలి సభ్యత్వానికి రాజీనామా చేశా
- స్వతంత్ర్యంగా జాగృతి స్థాపించి ఉద్యమంలో పని చేశా
- 2006లో నేను ఉద్యమంలోకి వచ్చా
- తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను ఊరూరా ప్రచారం చేశా
- మన చారిత్రక వారసత్వం,సంపదను కాపాడుకునేందుకు పోరాడా
- మన భాష,యాసకు సినిమాల్లో అవమానం జరిగితే ప్రశ్నించా
- పాఠ్యాంశాల్లో మహానీయుల చరిత్ర కోసం పోరాటం చేశా
- గల్లీలో కాదు.. ఢిల్లీలో తెలంగాణ కోసం లాబీయింగ్ చేశా
- తెలంగాణ ఇస్తామని నిర్ణయం తీసుకుని సోనియా ఢిల్లీకి పిలిపించారు
- జార్జి ఫెర్నాండెజ్ తో కేసీఆర్ మీటింగ్ కు ఏర్పాటు చేయించా
- 2014లో టీఆర్ఎస్ సొంతంగా పోటీ చేసింది
- నా కుటుంబ సభ్యులతో చర్చించి రాజకీయాల్లో వచ్చాం
- పార్టీ నిర్ణయం మేరకు 2014లో ఎన్నికల్లో పోటీ చేశా
- టీఆర్ఎస్ ను నేను ఎప్పుడూ టికెట్ అడుక్కోలేదు
- 2014లో నా ఎంపీ పరిధిలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది
- ఢిల్లీలో అనేక అంశాలపై కొట్లాడా
- కేవలం పదవుల కోసమే నేను టీఆర్ఎస్ పనిచేయలేదు
- పార్టీ అప్పగించిన అన్ని పనులు ప్రజల కోసం పనిచేశా
- బీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు ఎదురైనా నవ్వుకుంటూ పనిచేశా
- బీఆర్ఎస్ ఏనాడు నాకు మద్దతుగా నిలవలేదు
- బీఆర్ఎస్ చానల్,పేపర్ ఏనాడు నాకు సపోర్ట్ చేయలేదు
- బీఆర్ఎస్ లో ప్రశ్నిస్తే నన్ను అణగదొక్కారు
- కేసీఆర్ చుట్టూ ఉన్నవాళ్లు నాపై కక్ష గట్టారు
- ప్రశ్నించినందుకు నాపై కక్ష గట్టి పార్టీ నుంచి వెళ్లగొట్టారు
- 2014లో స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి
- పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడ కేసీఆర్ కు చెప్పా
- సిరిసిల్ల,సిద్దిపేట, కలెక్టరేట్ట నిర్మాణంలో అవినీతి జరిగితే దిక్కులేదు
- ఉద్యమ కారులను బీఆర్ఎస్ నమ్మించి మోసం చేసింది
- 1969 ఉద్యమ కారులను బీఆర్ఎస్ గుర్తించలేదు
- నీళ్లు, నిధులు నియామకాలకు బీఆర్ఎస్ గండి కొట్టింది
- నేరేళ్ల ఇసుక దందాలో అమాయక దళితులు బలయ్యారు
- టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడాన్ని వ్యతిరేకించా
- తెలంగాణలో ఏం చేశామన మనకు జాతీయ రాజకీయాలు
- అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సెక్రటేరియట్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది
- బీజేపీపై నేను ఎడతెగని పోరాటం చేశాం
- మూడేళ్లు,నేను ఈడీ,సీబీఐ కేసులతో ఇబ్బంది పడ్డా
- కేసీఆర్ మీద కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది
- ఈ మూడేళ్లు నాకు ఏనాడు పార్టీ అండగా నిలబడలేదు
- అవినీతిని ప్రశ్నిస్తే..తెల్లారే వరకు సస్పెండ్ చేశారు.
- కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కూడా తీసుకోలేదు
- బీఆర్ఎస్ లో పార్టీ రాజ్యాంగం పెద్ద జోక్
- పార్టీని నడిపించే పద్దతి ఇదా.?
- లక్ష్మీ నరసింహస్వామి, ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా..
- నాది ఆస్తుల పంచాయతీ కాదు..ఆత్మగౌరవ పంచాయతీ
- నైతిక లేని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినందుకు సంతోషిస్తున్నా
- అన్ని పార్టీలు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి
- బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రశ్నించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది
- పదవికి రాజీనామా చేసినా ప్రజల కోసం పనిచేస్తా
- అపడు ప్రశ్నించా..ఇపుడు ప్రశ్నించా..రేపు కుూడా ప్రశ్నిస్తా..
- మీరందరి ఆశీర్వాదంతో శక్తిగా తిరిగొస్తా
- రాజీనామా పునరాలోచన చేసేది లేదు..అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నా
