ఇదేందయ్యా ఇది: కళ్లకు కాటుక పెట్టి బంగారు గొలుసు మాయం చేసిన మహిళలు

ఇదేందయ్యా ఇది: కళ్లకు కాటుక పెట్టి బంగారు గొలుసు మాయం చేసిన మహిళలు

హైదరాబాద్: రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోన్న టెక్నాలజీతో పాటు దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో మాదిరిగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో లేదా అర్ధరాత్రి వేళ మాత్రమే దొంగతనాలు చేయడం లేదు. కాస్తా బ్రెయిన్ వాడి పట్టపగలు కూడా ఈజీగా చోరీలు చేస్తూ అందినకాడికి దోచుకుపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కళ్లకు కాటుక పెట్టీ ఓ వృద్దురాలి బంగారు గొలుసు మాయం చేశారు మహిళల దొంగల ముఠా. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఓ వృద్దురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన కొందరు మహిళల ముఠా ఆమె దగ్గరికి వెళ్లింది. మార్కెట్‎లోకి ఓ కాటుక బ్రాండ్ కొత్తగా వచ్చిందని వృద్దురాలిని నమ్మించి ఆమె కళ్లకు కాటుక పూశారు. వెంటనే ఆ వృద్దురాలు స్పృహ కోల్పోయింది. అనంతరం వృద్దురాలి మెడలో ఉన్న రెండు తులాల గొలుసు తీసుకొని పారిపోయారు మహిళలు. 

►ALSO READ | నాపై డ్రగ్స్ కేసు కొట్టేయండి: హైకోర్టులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ పిటిషన్

గమనించిన వృద్దురాలి కుటుంబ సభ్యులు గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో ఊరంతా వెతికి మహిళలను పట్టుకుని దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. వృద్దురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ ఘటన క్షణాల్లో ఊరంతా వ్యాపించడంతో ఇలా కూడా దొంగతనాలు చేస్తున్నారా.. ఇలా తయ్యారేంటమ్మా అంటున్నారు గ్రామస్థులు.