IND vs SA: సిరీస్ మనదే: సూర్యవంశీ విధ్వంసం.. సౌతాఫ్రికాపై రెండో వన్డేలో టీమిండియా ఈజీ విక్టరీ

IND vs SA: సిరీస్ మనదే: సూర్యవంశీ విధ్వంసం.. సౌతాఫ్రికాపై రెండో వన్డేలో టీమిండియా ఈజీ విక్టరీ

అండర్-19 సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా కుర్రాళ్ళు రెండో వన్డేలోనూ అలవోకగా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. సోమవారం (జనవరి 5) బెనోని వేదికగా విల్లోమూర్ పార్క్ లో జరిగిన ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 24 బంతుల్లోనే 68 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. జాసన్ రౌల్స్ 114 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. డేనియల్ బోస్మాన్ 31 పరుగులు చేసి రాణించగా మిగిలిన వారు విఫలమయ్యారు. కిషన్ కుమార్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టి సఫారీలను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. ఆర్.ఎస్. అంబ్రిష్ రెండు వికెట్లతో రాణించాడు. లక్ష్య ఛేదనలో ఇండియా 23.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాడ్ లైట్ కారణంగా ఇండియా ఛేజింగ్ చేస్తున్నపుడు మ్యాచ్  మధ్యలోనే ఆగింది. మ్యాచ్ దిగడంతో టీమిండియా లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174 పరుగులుగా నిర్దేశించారు.  

►ALSO READ | Ashes 2025-26: స్టోక్స్ మరోసారి చిక్కాడు.. అశ్విన్ అరుదైన రికార్డ్ బ్రేక్ చేసిన స్టార్క్

సూర్యవంశీ ఊచకోత:
 
డక్ వర్త్ లూయిస్ పద్ధతి ముందు 246 పరుగుల ఛేజింగ్ లో బరిలోకి దిగిన ఇండియాకు వైభవ్ స్యుర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించిన వైభవ్ సూర్యవంశీ.. తాను ఎదర్కొన్న తొలి 10 బంతుల్లోనే 6 సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇదే ఊపులో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ 14 ఏళ్ళ కుర్రాడు.. ఓవరాల్ గా 24 బంతుల్లో 68పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. సూర్య ఔటైన తర్వాత త్రివేది, కుండు జాగ్రత్తగా ఆడుతూ ఇండియాకు విక్టరీ అందించారు.