ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. తొలి రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం చూపిస్తే రెండో రోజు ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. తొలి రోజు ఆటలో భాగంగా అదరగొట్టిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆ జౌ కొనసాగించలేకపోయింది. రూట్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయడం తప్పితే మిగిలిన వారు విఫలమయ్యారు. ఈ సిరీస్ లో టాప్ ఫామ్ లో ఉన్న స్టార్క్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ తీసుకొని టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ రికార్డ్ బ్రేక్ చేశాడు.
హ్యారీ బ్రూక్ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన స్టోక్స్ 11 బంతులాడి డకౌటయ్యాడు. స్టాక్ బౌలింగ్ లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టెస్ట్ క్రికెట్ లో స్టోక్స్ ను ఔట్ చేయడం స్టార్క్ కు ఇది 14వ సారి. ఈ మ్యాచ్ ముందువరకు ఈ రికార్డ్ అశ్విన్, స్టార్క్ లతో సమంగా ఉంది. అశ్విన్ టెస్టుల్లో స్టోక్స్ ను 13 సార్లు ఔట్ చేశాడు. స్టార్క్ 14 సార్లు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ ను పెవిలియన్ కు చేర్చి అశ్విన్ ను వెనక్కి నెట్టాడు. ఈ మ్యాట్ లో స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు డకెట్ ను ఔట్ చేసిన ఈ ఆసీస్ పేసర్ రెండో రోజు స్టోక్స్ ను పెవిలియన్ కు పంపాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో స్టార్క్ ఇప్పటివరకు 28 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
►ALSO READ | Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీ ఆడనని చెప్పిన కోహ్లీ.. కారణం ఇదే!
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 384 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ 160 పరుగులు చేసి జట్టు భారీ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. హ్యారీ బ్రూక్ 84 పరుగులు చేసి రాణించగా.. జెమీ స్మిత్ 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైకేల్ నేసర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బొలాండ్, స్టార్క్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. గ్రీన్, లబు షేన్ లకు తలో వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. హెడ్ 91 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఉన్నాడు.
