ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ప్రీమియర్ షో టికెట్ ఎంత పెంచమని తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగారంటే..

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ప్రీమియర్ షో టికెట్ ఎంత పెంచమని తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగారంటే..

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. జనవరి 8న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఆ ప్రీమియర్ షో టికెట్ను.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 800 రూపాయలు (జీఎస్టీ అదనం), మల్టీప్లెక్స్ల్లో 1000 రూపాయలకు (జీఎస్టీ అదనం) అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అంతేకాకుండా.. జనవరి 9న తెల్లవారుజామున 4 గంటల షోకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది. 

అంతేకాకుండా.. డే1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెగ్యులర్ టికెట్ ధరపై 102 రూపాయల పెంపును, మల్టీప్లెక్స్ టికెట్ ధరపై 132 రూపాయల పెంపును కోరుతూ ‘ది రాజా సాబ్’ సినిమా నిర్మాణ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రికి, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఈ లేఖ రాశారు. అయితే.. జనవరి 4న ఈ లేఖ రాసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికైతే స్పందన లేదు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే.. రాజా సాబ్ ప్రీమియర్ షో ధర సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 800 రూపాయల పైమాటే.

ప్రభాస్‌‌‌‌‌‌‌‌ హీరోగా మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమా నుంచి ‘నాచో.. నాచో’ వీడియో సాంగ్ కూడా విడుదలైంది. ‘రాజా సాబ్’ ట్రైలర్ 2.O పేరుతో మరో ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. రాజాసాబ్‌‌‌‌‌‌‌‌కు నాయనమ్మ అయిన గంగమ్మ (జరీనా వాహబ్‌‌‌‌‌‌‌‌) అన్ని మర్చిపోతుంటుంది. కానీ తన భర్త (సంజయ్ దత్‌‌‌‌‌‌‌‌)ను మాత్రం మర్చిపోలేక ఇబ్బంది పడుతుంటుంది. మిస్టీరియస్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ అయిన తన తాత గురించి తెలుసుకునేందుకు మయసభ లాంటి తాత హవేలీలోకి అడుగుపెడతాడు.  అక్కడున్న వస్తువులు,  పెయింటింగ్స్‌‌‌‌‌‌‌‌, ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటివన్నీ హిప్నటైజ్ చేసేలా డిజైన్ చేసి, అందులోకి అడుగుపెట్టిన వాళ్లు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లేలా  చేస్తాడు తాత.

►ALSO READ | క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ‘ఆడాల్సెన్స్’ హవా.. రికార్డు సృష్టించిన చిన్నారి నటుడు!

అంతేకాదు దుష్ట శక్తులను ఆవాహనం చేసుకున్న తాత బంగ్లాలో అడుగడుగునా ప్రమాదాలే. అంత ప్రమాదకరమైన ఆ భవనంలోకి రాజా సాబ్‌‌‌‌‌‌‌‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది...  భూత ప్రేతాలు,  హిప్నాటిజం చిక్కుముడుల నుంచి ఎలా బయటపట్టాడు అనేది అసలు కథ. ఓవైపు భయపడుతున్నట్టుగా,  మరోవైపు ధీరుడిగా డిఫరెంట్ మేకోవర్స్‌‌‌‌‌‌‌‌తో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ కనిపించాడు.  ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివర్లో హాలీవుడ్ మూవీ ‘జోకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ గెటప్‌‌‌‌‌‌‌‌ను గుర్తుచేసే మేకప్‌‌‌‌‌‌‌‌తో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ కనిపించాడు.