మలయాళం సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు మరియు ప్రొడక్షన్ కంట్రోలర్ కన్నన్ పత్తాంబి 62 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన కోవ్లీకొడ్లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో కిడ్నీ సంబంధిత సమస్యకు చికిత్స పొందుతూ జనవరి 4న ఆదివారం రాత్రి 11:41 గంటలకు మరణించారు. ఈ విషయాన్ని కన్నన్ పత్తాంబి సోదరుడు, దర్శకుడు–నటుడు మేజర్ రవి సోషల్ మీడియాలో ధృవీకరించారు.
“నా ప్రియమైన సోదరుడు, సినిమాకు సేవలందించిన ప్రొడక్షన్ కంట్రోలర్ కన్నన్ పత్తాంబి జనవరి 4న రాత్రి 11:41 గంటలకు మరణించాడు. అంత్యక్రియలు పట్టాంబిలోని నంజట్టిరిలో సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయి. నా సోదరుడు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. ఓం శాంతి” అని డైరెక్టర్ మేజర్ రవి ట్వీట్ చేశారు.
కన్నన్ పత్తాంబి సినీ ప్రస్థానం:
నటుడు మరియు ప్రొడక్షన్ కంట్రోలర్‌గా మలయాళం సినీ ఇండస్ట్రీలో కన్నన్ పత్తాంబి సేవలందించారు. ప్రొడక్షన్ కంట్రోలర్‌గా, 2010లో మోహన్‌లాల్ ‘‘కందహార్’ చిత్రంతో పాటుగా అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్స్ సినిమాల నిర్వహణలో కన్నన్ పత్తాంబి కీలకంగా పని చేశారు. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ మూవీ "మన్యం పులి" సినిమాకు ఆయన ప్రొడక్షన్ టీమ్‌లో భాగంగా ఉన్నారు. కర్మ యోధ, ఒడియన్, 12th మ్యాన్, అనంతభద్రం, కీర్తిచక్ర, వెట్టం, కందహార్, క్రేజీ గోపాలన్ వంటి సినిమాలు చేసి మంచి పేరుతెచ్చుకున్నారు.
ALSO READ : నీలోఫర్ కేఫ్‍లో అల్లు అర్జున్ దంపతులకు చేదు అనుభవం..
మలయాళంలో అత్యంత ఫెమస్ అయిన ఆయన సోదరుడు, దర్శకుడు మేజర్ రవితో కలసి పనిచేయడంతో మరింత గుర్తింపు పొందారు. మేజర్ రవి నిర్మించిన ప్రాజెక్ట్‌లలో కన్నన్ పత్తాంబి ముఖ్య పాత్ర పోషించారు. ముఖ్యంగా Mission 90 Days చిత్రంలో, రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగిన దర్యాప్తు అనుభవాలపై ఆధారపడి, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఆయన కీలకంగా సహకరించారు. ఆయన అనుభవం, మేనేజ్‌మెంట్ నైపుణ్యం సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
