- వచ్చేనెల 25 వరకు లాస్ట్ చాన్స్
హైదరాబాద్, వెలుగు: అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునేందుకు టీజీపీఎస్సీ మరోసారి గడువును పొడిగించింది. వచ్చేనెల 25 వరకు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఇదే చివరి అవకాశమని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించేది లేదని కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు కమిషన్ సెక్రెటరీ హరిత ఒక ప్రకటన రిలీజ్ చేశారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు ఓటీఆర్ డేటాను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామని, అప్లికేషన్ ఫామ్‌లో అదే డేటా వస్తుందని స్పష్టం చేసింది. దీంతో అభ్యర్థులు ఓటీఆర్ లో తమ వివరాలను జాగ్రత్తగా నింపి, సంబంధిత సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలని సూచించారు. చివరి నిమిషం వరకు వేచి ఉండి సాంకేతిక ఇబ్బందులు పడకుండా.. ముందుగానే కమిషన్ వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.
