పరీక్షలకు వేళాయే..రేపటి(ఫిబ్రవరి25) నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

పరీక్షలకు వేళాయే..రేపటి(ఫిబ్రవరి25) నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
  • ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిపి అటెండ్ కానున్న 
  • 9.97 లక్షల మంది స్టూడెంట్లు
  • రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు 
  • నిర్ణీత టైమ్​ కంటే 5 నిమిషాలు లేటైనా అనుమతి 
  • ఫీజుల పేరుతో వేధిస్తే కాలేజీలపై చర్యలు: ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
  • హాల్ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ప్రిన్సిపాల్ సిగ్నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకున్నా అనుమతిస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకూ జరిగే ఈ ఎగ్జామ్స్‌‌కు రాష్ట్రవ్యాప్తంగా 9.97 లక్షల మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.  

పరీక్షలకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,97,075 మంది స్టూడెంట్స్‌‌ పరీక్షలకు హాజరుకానున్నారు.  ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.  విద్యార్థులు గంట ముందే అంటే.. ఉదయం 8 గంటల వరకు సెంటర్లకు చేరుకోవాలని కృష్ణ ఆదిత్య సూచించారు. 

అయితే ట్రాఫిక్, ఇతర కారణాల వల్ల ఆలస్యమైతే విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో.. పరీక్ష ప్రారంభం అయ్యాక 5 నిమిషాల వరకు అనుమతించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మాల్ ప్రాక్టీస్‌‌కు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు.

 ప్రతి సెంటర్‌‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని బోర్డు కంట్రోల్ రూమ్‌‌కు అనుసంధానించామన్నారు. పరీక్షల నిర్వహణకు 28,500 మంది ఇన్విజిలేటర్లను నియమించామని, కాపీయింగ్‌‌ను అరికట్టేందుకు 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాయని చెప్పారు.  

ప్రతి ఎగ్జామ్ సెంటర్‌‌‌‌లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌‌మెంటల్ ఆఫీసర్‌‌‌‌ను నియమించినట్టు తెలిపారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచామన్నారు.

ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు..

ఫీజులు కట్టలేదనే సాకుతో ప్రైవేట్ కాలేజీల మేనేజ్‌‌మెంట్లు హాల్ టికెట్లు ఇవ్వకుండా స్టూడెంట్స్‌‌ను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణ ఆదిత్య హెచ్చరించారు. ఒకవేళ కాలేజీలో హాల్ టికెట్ ఇవ్వకపోయినా విద్యార్థులు ఆందోళన చెందవద్దని, నేరుగా బోర్డు వెబ్‌‌సైట్ tgbie.cgg.gov.in నుంచి డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవచ్చని సూచించారు. ఆన్‌‌లైన్ హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని, ఈ మేరకు చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలిచ్చామని స్పష్టం చేశారు. సెల్‌‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. 

సమస్యలుంటే కంట్రోల్‌‌ రూం నెంబర్‌‌‌‌కు కాల్​ చేయండి..

విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనకు గురికావొద్దని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కృష్ణ ఆదిత్య సూచించారు. ఏవైనా సమస్యలుంటే బోర్డు కంట్రోల్ రూమ్ నెంబర్ 040-– 24655027 కు కాల్ చేయాలని తెలిపారు. దీంతోపాటు విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ‘టెలి–మానస్’ సేవలను ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చిందన్నారు. మానసిక ఒత్తిడి అనిపిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 14416 కు ఫోన్ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చని కృష్ణ ఆదిత్య సూచించారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖను కోరినట్లు ఆయన వెల్లడించారు.

ఇంటర్ స్టూడెంట్ల వివరాలు 

జెండర్    ఫస్టియర్ (జనరల్)    వొకేషనల్    సెకండియర్ (జనరల్)    ఒకేషనల్    మొత్తం 
బాయ్స్    2,17,428    22,586    2,31,471    22,429    4,93,914 
గర్ల్స్    2,24,437    24,675    2,30,850    23,199     5,03,161
మొత్తం    4,41,865    47,261    4,62,321    45,628    9,97,075