DASHAVATAR Oscar 2026: ప్రాంతీయ కథకు గ్లోబల్ గుర్తింపు.. తొలి మరాఠీ సినిమాగా ఆస్కార్ రేసులోకి ‘దశావతార్’

DASHAVATAR Oscar 2026: ప్రాంతీయ కథకు గ్లోబల్ గుర్తింపు.. తొలి మరాఠీ సినిమాగా ఆస్కార్ రేసులోకి ‘దశావతార్’

భారతీయ ప్రాంతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరిస్తూ, మరాఠీ చిత్రం ‘దశావతార్‌’ అరుదైన ఘనతను సాధించింది. 2026 ఆస్కార్ (Oscars 2026) అవార్డుల (98వ అకాడమీ అవార్డ్స్‌) పోటీలో నిలిచేందుకు అర్హత సాధించిన చిత్రాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం, నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌ ప్రకటించాయి.

ఇండియన్ రీజినల్ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ 2026 రేసులో మరాఠీ ఫిల్మ్ ‘దశావతార్’ (Dashavatar) నిలిచి చరిత్ర సృష్టించింది. భారతీయ ప్రాంతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ, ‘దశావతార్’ అరుదైన ఘనతను సాధించింది. 98వ అకాడమీ అవార్డ్స్‌ (Oscars 2026) పోటీలో నిలిచే చిత్రాల కంటెన్షన్ లిస్ట్‌లోకి అడుగుపెట్టిన తొలి మరాఠీ చిత్రంగా ‘దశావతార్’ రికార్డ్ సృష్టించింది.

దర్శకుడు సుబోధ్ ఖానోల్కర్ తెరకెక్కించిన ఈ సినిమా, ఆస్కార్ రేసులోకి ప్రవేశించిందని చిత్ర నిర్మాతలు ఆదివారం (జనవరి 4) అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా అకాడమీ స్క్రీనింగ్‌ రూమ్‌లో ప్రదర్శితం కానున్న తొలి మరాఠీ చిత్రం కూడా ఇదేనని చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా జీ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా ఈ విజయాన్ని పంచుకుంది.

“ఎర్ర మట్టిలో పుట్టిన కథ.. సంప్రదాయంతో పెరిగింది.. ఇప్పుడు ప్రపంచానికి చేరింది. ఆస్కార్ దిశగా ‘దశావతార్’ ప్రయాణం మొదలైంది” అంటూ గర్వంగా వెల్లడించింది. ఇది కేవలం ఒక సినిమాకు మాత్రమే కాదు.. మొత్తం భారతీయ రీజినల్ సినిమాకే గర్వకారణంగా మారిందని నిర్మాతలు తమ అభిప్రాయం పంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రాంతీయ కథలు ప్రపంచ వేదికపై వెలుగులోకి రావడానికి ఇది గొప్ప అడుగుగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

►ALSO READ | Sudha Chandran: పూనకంతో ఊగిపోయిన సుధా చంద్రన్.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ఇకపోతే, సెప్టెంబర్ 12, 2025లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇందులో దిలీప్ ప్రభావల్కర్ కీలక పాత్ర పోషించారు. ఆయనతో పాటు మహేష్ మంజ్రేకర్, భరత్ జాదవ్, సిద్ధార్థ్ మీనన్, ప్రియదర్శిని ఇండల్కర్, విజయ్ కేంకరే, రవి కాలే, అభినయ్ బెర్డే తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.