మీరు ఒక మంచి ఉద్యోగంతో నెలకు రూ. 50వేల జీతం సంపాదిస్తుంటే... ముఖ్యంగా ముంబై, ఢిల్లీ లేదా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పెరుగుతున్న ఖర్చుల కారణంగా పెద్ద మొత్తం సేవింగ్స్ కష్టం అని మీరు అనుకోవచ్చు. కానీ మంచి విషయం ఏమిటంటే క్రమశిక్షణ పద్ధతితో సేవింగ్స్, తెలివైన పెట్టుబడి మెల్లిమెల్లిగా గొప్ప కార్పస్‌ను నిర్మించడంలో మీకు సహాయపడతాయి. కాంపౌండింగ్, స్థిరమైన పెట్టుబడులు, కొంచెం ఓపిక ద్వారా రూ.1 కోటి కూడబెట్టడం ఖచ్చితంగా సాధించవచ్చు.
ఈరోజుల్లో యువత తమ కెరీర్ ప్రారంభంలోనే ఆర్థిక క్రమశిక్షణతో గొప్ప సంపదను సృష్టిస్తోంది. ఇందుకు ఎక్కువగా ఎంచుకుంటున్న మార్గం మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP). ఉదాహరణకి చెప్పాలంటే మీరు నెలకు కేవలం 10వేల రూపాయలతో SIP ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే, అది 1 కోటి రూపాయల భారీ నిధిగా మారవచ్చు.
ఇందుకు పెట్టుబడి వ్యవధి: 21 సంవత్సరాలు
*అంచనా వేసిన రాబడి: 12% మొత్తం
*పెట్టుబడి మొత్తం: రూ. 25.2 లక్షలు
*అంచనా వేసిన రాబడి: రూ. 79.1 లక్షలు
*మెచ్యూరిటీ కార్పస్: రూ. 1.04 కోట్లు.
ఇలా ప్రతినెలా పెట్టుబడి మొత్తం ఎక్కువగా ఉండటం వల్ల వేగంగా ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు, ప్రతినెలా SIP మొత్తం రూ. 20 వేలు, అంచనా వేసిన రాబడి రేటు 12% అయితే, మీరు దాదాపు 16 సంవత్సరాలలో రూ. 1 కార్పస్‌ను సాధించవచ్చు.
మీరు మీ 20 ఏళ్లకి పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, మరో 20–30 సంవత్సరాలు పెట్టుబడి చేస్తే 'కాంపౌండింగ్' అంటే చక్రవడ్డీ మీ సంపదను ఊహించలేనంతగా పెంచుతుంది. ఎంత ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉంటే, మీ పెట్టుబడి అంత వేగంగా పెరుగుతుంది. మీ వయసు తక్కువగా ఉండటం వల్ల మీరు ధైర్యంగా కొన్ని మార్కెట్ రిస్క్‌లు తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ పడిపోయినా, తిరిగి కోలుకోవడానికి మీకు తగినంత సమయం ఉంటుంది. కాబట్టి నష్టాల గురించి భయపడాల్సిన అవసరం ఉండదు.
►ALSO READ | 200MP AI కెమెరా, లేటెస్ట్ క్రేజీ ఫీచర్లతో OPPO రెనో15 సిరీస్.. జనవరిలోనే లాంచ్ డేట్ ఫిక్స్!
నెలకు రూ. 50,000 జీతం నుండి కనీసం 20–30% సేవింగ్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. అంటే నెలకు రూ.10,000–15,000. ఈ మొత్తం మీ జీతం క్రెడిట్ అయిన వెంటనే పెట్టుబడిలోకి ఆటోమేట్ చేయండి. మీ ఆదాయం లేదా జీతం పెరుగుతున్న కొద్దీ, మీ ఖర్చులు పెంచుకునే బదులు ఈ మొత్తాన్ని పెట్టుబడి పెంచుకునేలా చూసుకోండి.
మీ మొదటి జీతం మీకు చివరిది కాదు కాబట్టి పదోన్నతులు, ఉద్యోగ మార్పులు సాధారణంగా మెల్లిమెల్లిగా ఆదాయాన్ని పెంచుతాయి. అలాగే కనీసం ఆరు నెలల ఖర్చులకి సరిపోయే అత్యవసర నిధి మీ వద్ద ఉండేలా చూస్కోండి. ఇందుకు ఆరోగ్య, టర్మ్ బీమా కూడా చాల ముఖ్యం. ఇవి అత్యవసర సమయంలో పెట్టుబడులు విత్ డ్రా చేయకుండా కొంత రక్షణగా ఉంటాయి.
గుర్తుంచుకోండి, రూ. 50,000 జీతం అనేది చిన్న ప్రారంభం కావొచ్చు, కానీ అది మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెడితే, కాంపౌండింగ్ వల్ల అంత ఎక్కువ లాభం పొందుతారు.
