అర్జున్ శర్మ బాయ్ ఫ్రెండ్ కాదు.. రూంమేట్ : అమెరికాలో హత్యకు గురైన నిఖిత తండ్రి

అర్జున్ శర్మ బాయ్ ఫ్రెండ్ కాదు.. రూంమేట్ : అమెరికాలో హత్యకు గురైన నిఖిత తండ్రి

అమెరికాలో హత్యకు గురైన నిఖిత తండ్రి స్పందించారు. నా పెద్ద కూతురును చంపిన ఆ శర్మగాడిని వదలొద్దని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారాయన. టీవీల్లో.. సోషల్ మీడియాలో వస్తున్నట్లు.. నా కూతురు నిఖితను చంపిన శర్మ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదని.. కేవలం రూంమేట్ మాత్రమే అని స్పష్టం చేశారాయన. అమెరికాలో కుమార్తె్ హత్య తర్వాత.. 2026, జనవరి 5వ తేదీన హైదరాబాద్ సిటీలో ఆయన మీడియాలో మాట్లాడారు ఆనంద్.

నా పెద్ద కుమార్తె నిఖిత నాలుగేళ్ల క్రితమే అమెరికా వెళ్లిందని.. అక్కడ అర్జున్ శర్మ పరిచయం అని చెప్పుకొచ్చారాయన. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగినట్లు నిఖిత స్నేహితులు చెబుతున్నారని.. ఆ డబ్బుల విషయంపైనే ఇద్దరు కలిసినట్లు తెలిసిందన్నారు తండ్రి ఆనంద్. చివరి సారిగా జనవరి ఒకటో తేదీన హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అని చెప్పింది.. ఇంతలోనే ఇంతటి విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు తండ్రి ఆనంద్.

నా కుమార్తెను చంపి.. వాడే మళ్లీ పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడని.. హత్య విషయం ఎలాగైనా బయటకు తెలుస్తుందన్న భయంతో ఇండియా పారిపోయి వచ్చాడన్నారు నిఖిత తండ్రి ఆనంద్. అర్జున్ శర్మను కఠినంగా శిక్షించాలని.. వాడిని వదలొద్దు అంటూ పోలీసులను వేడుకున్నారాయన. మా పాప డెడ్ బాడీని అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చే విధంగా సాయం చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకున్నారాయన. 

ALSO READ :  నీలోఫర్‌ కేఫ్‍లో అల్లు అర్జున్ దంపతులకు చేదు అనుభవం.

నా కూతురికి జరిగిన విధంగా ఎవ్వరికీ జరగకూడదని.. అర్జున్ శర్మకు ఇండియాలో లేదా అమెరికాలో.. ఎక్కడైనా కఠినంగా శిక్ష పడే విధంగా చూడాలని కోరారు. అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడని.. అదే విధంగా నా కూతురు దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్లు.. నిఖిత స్నేహితులు చెబుతున్నారంటూ వివరించారాయన. 

అర్జున్ శర్మ అనేవాడు నా కుమార్తె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదని.. కేవలం రూంమేట్ మాత్రమే అని.. అది కూడా ఇప్పుడు కాదని స్పష్టం చేశారు తండ్రి ఆనంద్.