- మెడికల్ బోర్డు ఏర్పాటు గురించి చర్చిస్తానని హామి
- గోదావరిఖని 11వ బొగ్గుగని సందర్శన
- కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ
గోదావరిఖని: సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. అదే విధంగా మెడికల్ బోర్డు ఏర్పాటు గురించి కూడా చర్చిస్తానన్నారు. రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని 11వ బొగ్గు గనిని ఆయన సందర్శించారు.
గని ఆవరణలోని దుర్గాదేవి ఆలయంలో ప్ర త్యేక పూజలు చేశారు. అక్కడి బొగ్గుగనిలో పని చేస్తున్న సింగరేణి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిసమ స్యలను నేరుగా తెలుసుకునేందుకు భూగర్భగనిలోకి దిగి పని స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థ రిటైర్డ్ కార్మికులకు రూ.10 వేలు పెన్షన్ వచ్చేలా పార్ల మెంటులో ప్రస్తావించడం జరిగిందన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామస్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
Also Read : తెలంగాణలో ఏం పీకినమని దేశ రాజకీయాలు
పార్లమెంట్ లో అవకాశం వచ్చినప్పుడు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడటం జరుగుతుందని చెప్పారు. కార్మికుల సొంతింటి కల నెరవేరేలాప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానన్నారు. మారుపేర్ల సమస్యను కూడా పరిష్కరించేం దుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా మహిళ కార్మికులకు ఎలాంటి సమస్యలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
