- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణ పరిధిలోని 13 ,26 వార్డు, వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మున్సిపల్చైర్పర్సన్పుల్కం రాజు, వైస్‌చైర్‌పర్సన్ నరాల శేఖర్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కౌన్సిలర్లు నీలమ్మ, శేఖర్, అంజయ్య, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.
నూకలమర్రిలో పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణం
వేములవాడరూరల్, వెలుగు: వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణంలో విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, లీడర్లు రాములు, పర్శరాములు, ప్రవీణ్, కరుణాకర్, ప్రశాంత్, రణధీర్, బాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చందుర్తి,వెలుగు: చందుర్తి మండల కేంద్రంలో ఇటీవల నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు, గ్రామస్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, సర్పంచ్ పులి సత్తయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామస్వామి,ఆలయ కమిటీ సభ్యులు తిరుపతి, గంగాధర్, నారాయణ, రాములు, బాబు, భూమేశ్, భక్తులు పాల్గొన్నారు.
