- రూ.49లక్షల అభివృద్ధి పనులపై తొలి సంతకం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తన చాంబర్‌లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు.. మేయర్‌ను సన్మానించారు.
రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి అవసరాల కోసం రూ.49 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైల్ మీద మేయర్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మేయర్‌గా అవకాశం కల్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో కార్పొరేషన్ లోని 66 డివిజన్ల అభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తానన్నారు.
