చాలామంది ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీలను తాగుతుంటారు. ఉదయం మంచిదే అయినా, పరగడుపున తాగడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరగడపున తాగడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి. కాబట్టి ఒక గ్లాస్ మంచి నీటిని తాగిన తర్వాతే కాఫీ, టీలు తీసుకోవాలి.
ఘాటైన మసాలా కూరలను కూడా పరిగడుపున తినకూడదు. అలా తింటే పొట్టలో తిప్పడమేకాక, రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కవ కాలం కొనసాగితే అల్సర్ వస్తుంది. కాబట్టి ఉదయం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
ఖాళీ కడుపుతో పుల్లని పదార్ధాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు. ఇబ్బంది కలుగుతుంది. పండ్లను కూడా తినడం అంతమంచిది కాదు.
ALSO READ : దాన..ధర్మాలు అంటే ఏమిటి..
అందులోనూ అరటిపండ్లకు దూరంగా ఉండాలి. అరటిలోని మెగ్నీషియం శరీరానికి హానిచేస్తుంది. శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణాశయంలో హాని చేసే కొన్ని ఆమ్లాలు విడుదలవుతాయి. వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
